Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడే మోక్షదా ఏకాదశి: ఈ రోజున ఇలా పూజ చేస్తే..?

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:51 IST)
మార్గశిర ఏకాదశినే మోక్షదా ఏకాదశిగా పిలుస్తుంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్లు , ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటినీ , పూజా మందిరాన్ని పరిశుభ్రపరుచుకోవాలి. 
 
విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటాన్ని పంచామృతాలతో అభిషేకించి , షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే ద్వాదశి రోజున పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
 
ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం ఉండాలి. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు ఈ వ్రతాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు. 
 
కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు , పాల ఉత్పత్తులు , పండ్లు మరియు ఇతర శాఖాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. మోక్షదా ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యం , ధాన్యాలు , పప్పుధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిషేదం.
 
ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు. శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. మోక్షాద ఏకాదశి సందర్భంగా 'భగవద్గీత', 'విష్ణు సహస్రనామం', 'ముకుందష్టకం' పఠించడం మంచి ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ రోజునే గీత జయంతిగా పిలుస్తారు.
 
రోజూ పంచాంగం చదవడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త వ్యాపారం చేపడితే విశేష ఫలితాలు లభిస్తాయి. పురాణాలప్రకారం, మోక్షదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పితృదేవతలకు మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ రోజున భగవద్గీతను కురుక్షేత్ర పురాణ యుద్ధం సమయంలో కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. 
 
 ఈ కారణంగా మోక్షదా ఏకాదశి వైష్ణవులకు లేదా విష్ణువు అనుచరులకు మంగళకరంగా జరుగుతుంది. మోక్షదా ఏకాదశి రోజు కూడా భగవద్గీతను అర్హులైన వారికి బహుమతిగా ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. మోక్షదా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే..  సంవత్సరమంతా 23 ఏకాదశి వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments