Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం విశిష్టత.. ఉపవాసాలతో ఆరోగ్యం మీ సొంతం

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:45 IST)
చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 29 నుంచి ప్రారంభమై ఆగ‌స్టు 27 వ‌ర‌కు ఉంటుంది. ఈ మాసంలో త‌ల్లిదండ్రుల‌ను, గురువుల‌ను గౌర‌వించాలి. ఈ మాసంలో ఇల్లు ప‌రిశుభ్రంగా ఉండ‌క‌పోతే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లుగ‌దు.
 
ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజూ నైవేద్యం సమర్పిస్తూ... పూజలు చేస్తారు. చాలా మంది ఈ నెలంతా మాంసం తినరు. భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాన్ని కొలుచుకుంటారు.  
 
శ్రావణమాసం ప్రతి రోజూ భక్తి శ్రద్ధలతో సాగిపోతుంది. ఉపవాస దీక్షల వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి, ఫిట్‌నెస్ పెరుగుతుంది. అందువల్ల అన్ని రకాలుగా శ్రావణమాసం మేలు చేస్తుంది. ఆయురారోగ్యాల్ని పెంచుతుంది. 
 
శ్రావ‌ణ‌మాసంలో తొలి సోమ‌వారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసం తిన‌కూడ‌దు. తొలి సోమ‌వారం రోజు విలాసాల‌కు దూరంగా ఉండ‌డం చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments