26న సూర్యగ్రహణం.. 16 ఏళ్లకు కేతుగ్రస్త గ్రహణం.. కన్య, ధనుస్సు రాశివారికి?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (14:25 IST)
డిసెంబర్ 26వ తేదీన ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఏర్పడుతోంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపై రావడం వల్ల గ్రహణాలు ఏర్పడుతాయి.  భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. మధ్యలో భూమి ఉంటుంది.

ఈ మూడూ ఒకే సరళరేఖపైకి చంద్రుడి మధ్యలో ఉండి ఆ ఆ నీడ సూర్యుడిపై పడి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ కనిపించకపోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. కానీ, అన్ని అమావాస్యల్లో సూర్యగ్రహణాలు ఏర్పడవు. సాధారణంగా సంవత్సరానికి ఐదు నుంచి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి. 
 
ప్రతి పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం పునరావృతం అవుతుంది. కానీ ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది. సూర్యహణం మార్గశిర బహుళ చతుర్దశి మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటకం, తుల, కుంభం, మీన రాశుల వారికి శుభం.. మేషం, వృషభ, మిథున, సింహ రాశుల వారికి మధ్యమంగా వుంటుంది. కానీ కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు. గ్రహణ స్పర్శ కాలంలో నదీస్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేయడం మంచిది. గ్రహణ కాలంలో భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్ర జపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపం, ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు కుమారులతో పాటు ఓ తల్లి మృతి.. ఎక్కడ?

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-03-2026 శనివారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?

ఇంద్రకీలాద్రి కొండపై మహాకుంభాభిషేకం... హాజరుకానున్న చంద్రబాబు, పవన్

06-03-2026 శుక్రవారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

05-03-2026 గురువారం ఫలితాలు- అన్ని విధాలా బాగుంటుంది..

తర్వాతి కథనం
Show comments