భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

సెల్వి
శుక్రవారం, 5 డిశెంబరు 2025 (18:57 IST)
ఆలుమగల సంబంధాలు బలపడాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి అంటున్నారు సైకలాజిస్టులు. దంపతుల్లో ముఖ్యంగా రాజీపడే ధోరణి వుండాలి. ఒకరి కోసం ఇంకొరు మెట్టు దిగాలి. పట్టుదల, మొండితనం వుండకూడదు. భార్యాభర్తలు చాలామంది గొడవ పడుతున్నప్పుడు పెద్దగా అరుస్తుంటారు. అర్థం పర్థం లేని మాటలు అనేస్తారు. అలాకాకుండా ఉండాలంటే గొడవ సమయంలో దంపతుల్లో ఒకరు సైలెంట్​గా ఉండాలని, దీని వల్ల ఎదుటివారికి కోపం కంట్రోల్ అవుతుందని సైకలాజిస్టులు సూచిస్తున్నారు. 
 
ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎదుటివారిని బాధ్యులుగా చేయడం మంచిది కాదు. ఒకరిలో వున్న ప్లస్‌లు, మైనస్‌లను గ్రహించి ప్రవర్తించడం మంచిది. ప్లస్‌లను అప్పుడప్పుడు ఎత్తిచూపాలి. నలుగురిలో భార్యాభర్తలు తమ భాగస్వామిని చులకన చేసి మాట్లాడకూడదు. సహనం చాలా ముఖ్యం. 
 
దాంపత్య బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. వివాహం కాక ముందు వరకు ఎలా ఉన్నా, పెళ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకపోవడం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఈ తరం దంపతుల్లో భేదాభిప్రాయాలు రావడానికి డబ్బు కూడా ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. 
 
అందుకే దంపతులిద్దరూ ఎవరెంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పొదుపు చేసినా దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోవడం అత్యుత్తమం అని సూచిస్తున్నారు. కలుపుగోలు తనంతో దంపతులు ప్రవర్తిస్తే కాపురం సజావుగా సాగుతుందని సైకలాజిస్టులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

స్పా పేరిట వ్యభిచార గృహం నడిపిన మహిళతో పాటు ముగ్గురు అరెస్ట్

ఇరాన్ పైన కురుస్తున్న ఆమ్లవర్షం: తలనొప్పి, శ్వాస సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

రూ. 15 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లాడితే భర్త నపుంసకుడని తేలింది

దేశవ్యాప్తంగా క్లస్టర్ పద్ధతిలో ఫార్మింగ్.. 61,125 మంది రైతులు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కె. దివ్యవాణి చౌదరి సారధ్యంలో బాపు బొమ్మ - విశ్వ మహిళ అవార్డ్స్ ప్రదానోత్సవం

Satya: జెట్లీ షూటింగ్ లో సత్య ను ఆడుకున్న దర్శకుడు రితేష్ రానా

Nagarjuna: కింగ్ 100 చిత్రం తాజా అప్ డేట్ - హైదరాబాద్ లో షూట్

Sumanth Prabhas: గోదారి గట్టుపైన సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ సాంగ్

Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం దేహ దారుడ్యానికి సిద్ధమవుతున్న మంచు మ‌నోజ్‌

తర్వాతి కథనం
Show comments