హనుమంతుని వ్రతం అందించే ఫలితం.....

అవసరాన్నిబట్టి, అవకాశాన్నిబట్టి, బలాన్నీ, బుద్ధిని ఉపయోగించి కార్యాన్ని సాధించుకురావడంలో హనుంమతుడికి గల నేర్పు అంతా ఇంతాకాదు. రాముడిని సేవించడం వలన కలిగే ఆనందం ఈ విశ్వంలో మరేదీ ఇవ్వలేదని చెప్పిన హనుమం

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (11:46 IST)
అవసరాన్నిబట్టి, అవకాశాన్నిబట్టి, బలాన్నీ, బుద్ధిని ఉపయోగించి కార్యాన్ని సాధించుకురావడంలో హనుంమతుడికి గల నేర్పు అంతా ఇంతాకాదు. రాముడిని సేవించడం వలన కలిగే ఆనందం ఈ విశ్వంలో మరేదీ ఇవ్వలేదని చెప్పిన హనుమంతుడు తనని సేవించే భక్తులకు కూడా అదే స్థాయి సంతోషాన్ని కలిగిస్తుంటాడు.
 
ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో గల హనుమంతుని క్షేత్రాలు నిత్యం భక్తుల రద్దీతో సందడిగా కనిపిస్తుంటుంది. సాధారణంగా అనారోగ్యాల కారణంగా బాధలుపడుతున్నవాళ్లు గ్రహ సంబంధమైన దోషాల వలన ఇబ్బందులను ఎదుర్కుంటున్నవాళ్లు, విద్యా సంబంధమైన విషయంలో వెనుకబడుతోన్న వాళ్లు హనుమంతుడి క్షేత్రాలను దర్శిస్తుంటారు. ఆ స్వామి ఆశీస్సులను అనుగ్రహాన్ని కోరుతుంటారు.
 
అలాంటి సమస్యల నుండి బయడపడడానికి హనుమద్ర్వతం కూడా ఒక చక్కని మార్గమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున హనుమంతుడి వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజ మందిరంలో హనుమంతుడి వెండి ప్రతిమకు పూజాభిషేకాలు జరపవలసి ఉంటుంది. నియమనిష్టలను పాటిస్తూ వ్రతాన్ని పూర్తి చేసి, స్వామివారికి ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆ స్వామికి ఆకుపూజ చేయించి అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి.
 
ఈ విధంగా చేయడం వలన శారీరక మానసిక పరమైన రుగ్మతలు తొలగిపోతాయనీ, కార్యసిద్ధి కలగడమే కాకుండా ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయని స్పష్టం చేయబడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్.. బాత్రూమ్‌లో పడిపోయిందని?

అన్నీ చూడండి

లేటెస్ట్

చంద్రోదయంతోనే చంద్రగ్రహణం, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు?

03-03-2026 మంగళవారం ఫలితాలు - కష్టానికి తగిన ప్రతిఫలం ఖాయం..

హోలీ మార్చి 4వ తేదీన జరుపుకోవాలట.. ఎందుకంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం?

మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

తర్వాతి కథనం
Show comments