Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?

Advertiesment
How to Worship
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:09 IST)
ఆంజనేయ స్వామి అంటే ఇష్టపడని వారుండరు. తలచినంతనే కష్టాలను తీర్చి, అభీష్టాలను నెరవేర్చేవారు స్వామివారు. ఆంజనేయుని పంచముఖ రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే త్రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించేందుకు హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. అప్పటి నుండే స్వామివారిని పంచముఖ రూపంలో కొలిచే సంప్రదాయం ప్రారంభమైంది. 
 
ఇలాంటి స్వామివారిని ప్రతీ మంగళవారం రోజున పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు. కనుక మంగళవారం రోజున స్వామివారిని నచ్చిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే మంచిది. తరచు గ్రహదోషాలు, శనిదోషాలతో బాధపడేవారు.. మంగళవారం రోజున.. ఉపవాస దీక్షను చేపట్టి హనుమాన్ చాలీసా అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని ప్రార్థిస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది. 
 
తమలపాకులంటే కూడా హనుమంతునికి చాలా ఇష్టం. కనుక స్వామివారి ఆలయానికి వెళ్లినప్పుడు కొన్ని తమలపాకులు కూడా తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించి.. హారితినిచ్చి పూజలు చేస్తే తప్పక గ్రహదోషాలనుండి విముక్తి లభిస్తుంది. కనుక ప్రతీ వారం తప్పక ఇలా చేయడం మీకే కాస్తైనా తేడా కనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాపారం చేయడానికి ఏదైనా నిర్ధిష్ట దిక్కు ఉందా..?