ఆదివారం నాడు సూర్యారాధన చేస్తే?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (21:16 IST)
ఆదివారాన్ని ఉత్తరాదిలో రవి వారం అని పిలుస్తుంటారు. రవి అంటే సూర్యుడు అని అర్థం. కనుక ఆదివారం నాడు ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని అనుగ్రహం లేకపోతే కోరిన విద్య లభించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జనకమహా రాజు గురువు యాజ్ఞవల్య్కుడు సూర్యుని అశుభ దృష్టి వల్ల వేదవిద్యను అభ్యసించలేకపోయాడు. అందువల్ల తపస్సు చేసి సూర్యుని శుభదృష్టి వల్ల సరస్వతిదేవి అనుగ్రహంతో శాస్త్రజ్ఞానం పొంది, యాజ్ఞవల్య్కస్మృతిని అందించాడు. 
 
అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ ''జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం'' అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. 
 
సూర్యుని అనుగ్రహం కోసం మాణిక్యాన్ని ధరించాలి. గోధుమలను, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. పాయసం నివేదించాలి. సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయం పఠించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిండుకుంటున్న పెట్రోల్ నిల్వలు.. దేశం చీకట్లోకి వెళ్లిపోతుందంటున్న పాక్ మంత్రి

సాయినాథుడికి నమస్కారం, శిరిడీలో టీవీకె చీఫ్ విజయ్

సోషల్ మీడియా ద్వారా చీరల వ్యాపారం చేస్తున్న భార్యను హత్య చేసిన భర్త, ఎందుకు?

నాడు దానవీశూరకర్ణ - నేడు కుంభకర్ణుడు : సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

ఆస్తి కోసం తల్లిదండ్రులు ఇంట్లో వుండగానే ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments