మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు..... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (12:23 IST)
మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు. మీ జీవితంలో ఎదురైన మంచి అనుభవాలను, సంతోషం కలిగించిన సంఘటనలను ఎప్పుడైనా నెమరేసుకుంటున్నారా? కష్టాల్లో ఉన్న స్నేహితులకు, బంధువులకు సహాయం చేసిన ఉదంతాలను గానీ మీకు ఇతరులు చేసిన మేలును గానీ తలచుకుంటున్నారా? 
 
ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడెందుకని పెదవి విరవకండి. ఇలాంటి 'మంచి' అనుభవాలను తలచుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీన్ని ఒక అలవాటుగా మలచుకుంటే ఒత్తడి తగ్గుముఖం పడుతుందని.

ఫలితంగా భావోద్వేగాలు మెరుగుపడుతున్నాయని వెల్లడైంది. అంతేకాదు, ఇలాంటి అలవాటు గలవారిలో గుండెజబ్బు లక్షణాలూ తక్కువగా ఉంటున్నట్టు మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మంచి అనుభవాలను నెమరు వేసుకోవటం ఆరంభించండి. 
 
పాపాయి బుడిబుడి అడుగులు వేయటం కావొచ్చు. పచ్చటి ప్రకృతి మధ్యలో వేడి వేడి కాఫీ తాగటం కావొచ్చు. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలైనా సరే. మనసుకు హాయిని, ఆనందాన్ని కలిగించిన ఘటనలేవైనా చాలు. తరచుగా వాటిని నెమరు వేసుకోవటం మొదలెట్టండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గానీ రాత్రి పడుకోబోయే ముందు గానీ దీన్నొక అలవాటుగానూ మలచుకోవచ్చు. వీలైతే నోట్‌బుక్కులో రాసుకోవచ్చు కూడా. 
 
దీని మూలంగా మనసులో సానుకూల భావాలు ఉప్పొంగుతాయి. ఇవి ఒత్తిడిని తట్టుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. నిజానికి మనకు పెద్ద పెద్ద ఒత్తిళ్లే ఎదురవ్వాల్సిన పనిలేదు. రోజువారీ పనులతోనూ ఎంతోకొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటాం.

సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకు మంచి విషయాలు అంతగా గుర్తుకురావు. ఇది మరింత ఒత్తిడికి, విచారానికి దారితీస్తుంది. ఇది ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతుంది. దీనికి మంచి అనుభావాలను నెమరు వేసుకునే అలవాటు విరుగడుగా ఉపయోగపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సర్ ప్రక్రియలో సాయం కోసం జ్యూడిషియ అధికారుల నియామకం : సుప్రీంకోర్టు ఆదేశం

పెట్రోల్ బంక్‌‍లో సిగరెట్ కాల్చొద్దన్న సిబ్బంది.. ఆగ్రహంతో ఇంధన ట్యాంకుకు నిప్పు (వీడియో)

దర్యాప్తు చేతకాకుంటే చెప్పండి సీబీఐకు అప్పగిస్తాం.. అనంతబాబు కేసులో ఏపీ పోలీస్‌పై సుప్రీం ఫైర్

కొణిదెల గ్రామంలో తాగునీటి కొరతకు సొంత డబ్బుతో పవన్ కల్యాణ్ సాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. వానలు కూడా పడతాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: షూటింగ్ పూర్తి చేసి నేను రెడీ అంటోన్న త్రినాధ రావు నక్కిన

Yash: టాక్సిక్‌ టీజ‌ర్‌తో స‌రికొత్త యూనివ‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసిన యశ్‌

Naresh: ఆనందం ఆపుకోలేక దర్శకుడిని, సుహాస్‌ను ముద్దు పెట్టుకున్న సీనియర్ నరేశ్

Singeetam: పొద్దుటూరులో సింగీతం శ్రీనివాస్ పంచాయితీ - తాజా అప్ డేట్..

ముంబైలో షూటింగ్ - చెన్నైలో ఫుడ్ ఆర్డర్.. ఫ్లైట్‌లో డెలివరీ.. ప్రభాస్ మామూలోడు కాదండోయ్..

తర్వాతి కథనం
Show comments