స్పర్శా సుఖం, స్త్రీ సాంగత్యం పట్ల ఆకర్షితమైతే?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (22:28 IST)
ఇంద్రియాలపై పట్టు వున్న వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు. అవి లేనివాడు అధోగతి పాలవుతాడు. ఇంద్రియ నిగ్రహంతో మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాడు. కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ అనేవే ఐదు జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం.

బుద్ధితో మనిషి మనస్సును  నిగ్రహించి ఈ ఐదు ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. విద్యార్ధులు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనించాలి. ఈ ఐదింటిలో ఏదైనా సరే దానికి ఇష్టమైన దానిపట్ల మరీ అనురక్తమైతే, దానికి మనస్సు తోడైతే యువత తమ లక్ష్యాన్ని సాధించలేరు.
 
చదువుకోవాల్సిన విద్యార్థి కళ్లు స్మార్ట్ ఫోన్లో వీడియోల పట్ల, చెవులు సినీ సంగీతం పట్ల, నాలుక బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్ల మీద, ముక్కు అత్తర్ల పట్ల, స్పర్శా సుఖం స్త్రీ సాంగత్యం పట్ల ఆకర్షితమైతే చదువు మీద ధ్యాస ఎట్లా నిలుస్తుంది. మనిషి పతనం చెందడానికి ఐదు ఇంద్రియాలు వాటివాటి ఇష్టాల పట్ల ఆకర్షితం కానక్కరలేదు. అతని పతనానికి ఒక్క ఇంద్రియం పట్టుతప్పినా చాలు.
 
సముద్రంలో నడుస్తున్న నావను తీవ్రమైన గాలి ఏవిధంగా ఒక ప్రక్కకు తోసివేస్తుందో అదే విధంగా ఒక్క ఇంద్రియమైనా చాలు విధ్యార్ధిని పతనానికి చేరుస్తుంది. నీటిలోని నావను తీవ్రమైన గాలి తోసివేసి నట్లుగా, మనస్సు లగ్నమైనప్పుడు ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. తదస్య హరతి ప్రజ్ఞాం అనే మాటను విధ్యార్ధులు, యువత పదేపదే గుర్తు చేసుకోవాలి. ఒక్క ఇంద్రియమైనా చాలు, అది బుద్ధిని హరిస్తుంది. అందుకే ఇంద్రియాలు పట్టుతప్పుతాయి. ఎప్పుడూ జాగరూకుడువై ఉండు అంటూ గీత హెచ్చరిస్తుంది.
 
కోతుల వంటి ఇంద్రియాలకు మాటిమాటికి బుద్ధి చెబితేనే, వాటిని అదుపు చేస్తేనే విజయపథంలో అవరోధాలు తొలగిపోతాయి. ఇదే విద్యార్థులకు, యువతకు భగవద్గీత ఇచ్చే సందేశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments