Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు చేతి వేళ్ళకు దేవుని ఉంగరాలు ధరించవచ్చా? అలాంటి వారు దేవుని రింగ్స్ ధరిస్తే నష్టమే..?

సాధారణంగా చాలా మంది తమ చేతి వేళ్లకు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలును ధరిస్తుంటారు. ఇంకొందరు మెడలో వేసే లాకెట్‌లలో కూడా దేవుడి ప్రతిమలు ఉంటాయి. ఇలా ధరించిన వారు ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే కళ్లకు అద్ద

Webdunia
బుధవారం, 10 మే 2017 (17:59 IST)
సాధారణంగా చాలా మంది తమ చేతి వేళ్లకు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలును ధరిస్తుంటారు. ఇంకొందరు మెడలో వేసే లాకెట్‌లలో కూడా దేవుడి ప్రతిమలు ఉంటాయి. ఇలా ధరించిన వారు ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే కళ్లకు అద్దుకోవడం వంటివి చేస్తుంటారు. అసలు దేవుని ఉంగరాలను ఎలా ధరించాలి. వాటిని ధరించడానికి నియమాలు ఉన్నాయా? పైగా అలాంటి నియమాలు పాటిస్తే మంచి జరుగుతుందా? అనే విషయాలను ఇక్కడ పరిశీలిస్తే... 
 
దేవుని ప్రతిమ కలిగిన ఉంగరాలు లేదా లాకెట్ ధరించిన వారు ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే ఉంగరాన్ని కళ్లకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఆ ప్రతిమల్లో దైవత్వం ఉందని భావిస్తారు కూడా. అయితే, ఉంగరాన్ని పెట్టుకోవలసిన విధంగా పెట్టుకోకపోతే మంచిది కాదని కొంతమంది పండితులు చెపుతున్నారు. 
 
చేతి వేళ్లకు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించే ముందు.. జాతక రీత్యా చూసుకోవడం, దేవాలయాల్లో పూజలు చేయించడం వంటివి చేయాలి. అలాంటి పూజలు చేసిన తర్వాత మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల దేవుని ప్రతిమకు శక్తివస్తుంది. అలా చేసిన ఉంగరాన్ని ధరించడం వల్ల దేవుడు మన వెంటే ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది. 
 
అదేసమయంలో ఇలాంటి ఉంగరాలను ధరించిన తర్వాత విధిగా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. ఉంగరంలో ఉన్న దేవుని ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు.. కాళ్లు గోళ్ల వైపు ఉండేలా జాగ్రత్త వహించాలి. అలాగే, ఉంగరాన్ని కళ్లకు అద్దుకునే సమయంలో గుప్పిట ముడిచి కళ్లకు అద్దుకోవాలి. 
 
స్త్రీలైతే బహిష్టు సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలు, లాకెట్స్ తీసివేయాలి. అలాగే, భోజనం చేసే సమయంలో వీటిని తీసి పక్కనబెట్టాలి. ఎందుకంటే మన ఎంగిలి దేవుని ప్రతిమకు అంటకూడదు. ముఖ్యంగా మాంసాహారం తినే సమయంలో ఉంగరాలని విధిగా తీసేయ్యాలి. మద్యపానం, పొగతాగే అలవాటు ఉన్న వారు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించకుండా ఉండటమే ఉత్తమం. ఇలాంటి జాగ్రత్తలు పాటించగలిగిన వారే దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించడం మంచిది. లేనిపక్షంలో దేవుని ఉంగరాల ధరించడం వల్ల కలిగే లాభాల కంటే నష్టమే అధికంగా కలుగుతుందని వేదపండితులు హెచ్చరిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments