శనిదేవుడంటే భయమెందుకు? ఇలా చేస్తే దోషాలు పోతాయి...

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (20:09 IST)
జీవితం కష్టనష్టాలను మానసికంగాను, శారీరకంగాను వాటిని ఎదుర్కునే విధంగా చేయడంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. ఇలాంటి బాధలను తట్టుకోవడం అంతతేలికైన విషయం కాదు. అందువలనే ఎంతటివారైనా శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని పూర్తిచేసుకుంటుంటాడు.
 
తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుండి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళుతాడు. శని దోషం బారిన పడినవాళ్లు ఆయనను శాంతింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందడం మినహా మరోమార్గం లేదు. శని దోషాల నుండి బయటపడి పూర్వ స్థితికి చేరుకోవాలంటే అది శని దేవునిని కరుణాకటాక్షాలతోనే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో శని అనుగ్రహాన్ని పొందే వివిధ మార్గాలలో పువ్వులు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.  
 
శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. శనిత్రయోదశి రోజున ఈ పువ్వులతో పూజించడం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరిగిపోతుంది. రకరకాల సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. శనివారం ఉదయాన్నే శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు, బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా గెలవదు - ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం

వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

పట్టపగలు నడిరోడ్డుపై భార్యను చంపుతుంటే చూస్తూనే వెళ్లిన జనం

Karnataka Professor: విద్యార్థినికి ఐ లవ్యూ యు చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన స్టూడెంట్ (video)

Gold Chain: సరికొత్త పద్ధతిలో గొలుసు దొంగతనం.. పెళ్లికి వచ్చిన అతిథిలా నటిస్తూ..

అన్నీ చూడండి

లేటెస్ట్

22-03-2026 ఆదివారం ఫలితాలు - మీ తప్పిదాలను సరిదిద్దుకునే..?

22-03-2026 నుంచి 28-03-2026 వరకు మీ వార ఫలితాలు- ఎవరికి లాభం?

నారాయణవనం వేద నారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజ మహోత్సవం

Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

తర్వాతి కథనం
Show comments