దేహాన్ని పోషించటం మైథునం-ఇవేనా?

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (21:16 IST)
ప్రతిరోజూ ఉదయమవుతుంది. ప్రతిరోజూ రాత్రవుతుంది. సంవత్సరాలు సంవత్సరాలే అలా దొర్లిపోతాయి. సగం ఆయువు నిద్రావస్థలోనే గడిచిపోతుంది. మిగిలిన సగం జీవితం కూడా మనిషి సుఖశాంతులనివ్వదు. బాల్యం క్రీడల్లో గడుస్తుంది. తరుణావస్థ తరుణీ ఆసక్తిలో వ్యయమవుతుంది. వృద్ధాప్యం జరారోగాలతో సదా పీడితమై వుంటుంది. 
 
నరజన్మ ఎత్తటం, శరీరాన్ని పుష్టివంతం చేసుకోవడానికేనా? శ్వాస-ఉచ్ఛ్వాసలు చేస్తూ ముసలివారు కావటానికా, ఇదేనా నరజన్మ ప్రయోజనం? జంతువుల కన్నా విశేషం నరజన్మకు మరేం వుంటుంది? కుక్కలు కూడా కడుపు నింపుకుంటాయి. యథేచ్చగా సంతానాన్ని కంటూ పోతాయి. మనుషులు కూడా ఈ మాత్రమే చేస్తే ఇక నరజన్మకున్న విశిష్టత ఏమిటి? దేహాన్ని పోషించటం మైథునం-ఇవే నరజన్మకు ప్రయోజనాలైతే, నిజంగా అప్పుడు నరజన్మకు అర్థం వుండదు. 
 
క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూత దయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం వీటిని అనుష్టించేవారి జన్మ చరితార్థమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎరుపు జరి, చిలుకపచ్చ రంగు.. మహిళలకు ఉచిత చీరల పంపిణీ

Heat Wave Forecast: ఏపీలో వేడిగాలులు.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు..

నాటో సహా మిత్ర దేశాలకు ఏమీ అర్థం కాదు : డోనాల్ట్ ట్రంప్ అసహనం

సెలవుల్లో గ్రామానికి వెళ్లిన విద్యార్థినిలు... సరదా కోసం సెల్ఫీకి యత్నించి చనిపోయారు..

11 యేళ్ల బాలికపై అత్యాచారం .. ఎవరికీ చెప్పొద్దంటూ రూ.150 చేతిలో పెట్టాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం

వైశాఖ కృష్ణ పక్ష పంచమి: ఉజ్జయిన్‌ మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతి

07-04-2026 మంగళవారం ఫలితాలు : రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..

తర్వాతి కథనం
Show comments