అవన్నీ నేనే భరిస్తూ వారిని కాపాడతాను: షిర్డి సాయి

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:47 IST)
1. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని కాపాడతాను. 
 
2. నేను సర్వాంతర్యామిని. భక్తుడు పతనావస్ధలో ఉంటే, అతనిని కాపాడుటే నా విధి. ప్రతి ప్రాణిలో నన్ను దర్శిస్తూ, కరుణార్ద్ర హృదయంతో ఆదరించి పోషిస్తారో, వారు నన్నునిజంగా పోషించినవారౌతారు.
 
3. నన్ను స్మరిస్తున్నవారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను. నేను ఆత్మ సందర్శనాన్ని, కైవల్యాన్ని ప్రసాదించి నా ఋణము తీర్చుకుంటాను. అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను తీరుస్తాను.
 
4. నా కధలు అత్యంత శ్రద్దతో విని మననం చేయువారికి సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది. నిత్యం స్మరిస్తూ, నన్నే ధ్యానిస్తూ నా నామోచ్చారణ చేస్తుండేవారిని, నన్ను స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను.
 
5. ఎవరైనా తన సర్వస్వాన్ని నా సన్నిధానంలో సమర్పిస్తే , నిరంతరం నన్ను స్మరిస్తుంటే, తన అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని నశింపచేసుకుంటారు. అతడు ప్రాపంచికమైన అన్ని దుర్గుణాలకు దూరమై, పాపకృత్యముల నుండి విముక్తి పొందుతాడు. అతడికి నిరంతర ఆనందం లభిస్తుంది.
 
6. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ, తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి సర్.. సుప్రీంకోర్టులో వాదించి విజయం సాదించిన 19 యేళ్ళ కుర్రోడు...

భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి.. అంత్యక్రియలు ముగించి ఇంటికి రాగానే?

కేరళ ద్విచక్రవాహనదారుడిని క్రమశిక్షణలో పెట్టిన ప్రభావతి అమ్మకు పోలీసులు సత్కారం

క్లాస్‌మేట్ చేతిలో దారుణ హత్యకు గురైన ఎంబీఏ పట్టభద్రురాలు

ప్రియురాలిని హత్య చేసి... మృతదేహాన్ని ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంకులో పడేసిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments