షిర్డిసాయి, జ్ఞానహినులు బోర్లించిన కుండలు వంటివారు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (22:19 IST)
షిర్డిసాయిబాబా భక్తులకు ఎన్నో విధాలుగా తన మహిమలు చూపారు. కోపర్గాం స్టేషన్ మాస్టరు వాలంబికి సాయిబాబా యందు విశ్వాసం లేదు. ఇతను ఒకసారి దాసుగణుతో... సాయిబాబా పిచ్చివాడు, మీరు ఎందుకు ఆయన వద్దకు వెళుతున్నారు అని అన్నాడు. 
 
అటు తర్వాత ఒకసారి దాసగణు షిరిడికి వెళుతూ వాలంబిని కూడా తనతో షిరిడికి తీసుకొని వచ్చారు. ఇద్దరూ శ్రీ సాయిబాబావారి దర్శనానికి వెళ్లారు. వారు మసీదుకు వెళ్లినప్పుడు బాబా మట్టిపాత్రలను కడిగి వాటిని నేలపై బోర్లిస్తూ వున్నాడు.
 
వాలంబి అది చూచి, బాబా ఆ మట్టి పాత్రలను ఎందుకు బోర్లా పెడుతున్నారు.? అని ప్రశ్నించాడు. నా వద్దకు వచ్చేవారందరు ఈ పాత్రలవలె అదోముఖంగా వుంటారని బాబా అన్నారు. అంటే తమ వద్దకు వచ్చేవారందరు అజ్ఞానులు గానే వస్తుంటారని బాబా తన అభిప్రాయమును భవగర్భితముగా వివరించారు.
 
ఎవరైతే బాబా వద్దకు ఐహిక కోరికలతో వస్తారో వారు శ్రీ సాయిదేవుని పూర్తిగా గ్రహించలేరని తెలుసుకోవాలి. బాబా వద్దకు జ్ఞానహీనులుగా ఎవరైతే వెళతారో వారందరిని జ్ఞానవంతులుగా చేయుటయే శ్రీ సాయిబాబా మార్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్కిటిక్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో రాణించేందుకు ఏపీ రెడీ.. నారా లోకేష్

అన్నామలై ఇదు నమ్మ ఇయక్కమ్‌లో 10 గంటల్లో 10 లక్షల మంది సభ్యులు

మంజీరా నదిలో మునిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

Cockroach Janta Party: ఢిల్లీకి చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే

మహిళకు పవన్ 'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

శ్రీవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం

05-06-2026 శుక్రవారం ఫలితాలు- రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి

హనుమంతుడు అక్కడే వుంటాడు

Vibhuvana Sankashti 2026: విభువన సంకష్టి చతుర్థి.. గరిక, బిల్వ పత్రాలతో పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments