బాబాకు శాంతమే భూషణం, మౌనమే అలంకారం

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:41 IST)
బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది. 
 
బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని బాబా చెప్పారు.
 
తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడు.
 
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా.... బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబా ది సచ్చిదానంద స్వరూపం. సాయినాధుడు నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. ఎల్లప్పుడు ఆత్మానందంలో తేలియాడుతుండేవారు.
 
మన గురించి మనం ఆలోచించడం  మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి నేను, నాది అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నారు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవరాశుల్లో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పారు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానసికస్థితి సరిగాలేని టెక్కీ రైలు పట్టాలపై పడుకున్నాడు.. తల మొండెం వేరయ్యాయి...

ప్లీజ్.. మాకు ఇంకో వందే భారత్ రైలును కేటాయించరూ... రైల్వే మంత్రికి సీఎం బాబు వినతి

కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన అస్సాం సీఎం

లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఓం బిర్లా

హస్తినలో సీఎం బాబు ... వైజాగ్ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

07-02-2026 శనివారం ఫలితాలు- గ్రహస్థితి అనుకూలంగా లేదు.

06-02-2026 శుక్రవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దల సలహా తీసుకోండి...

Mahashivratri 2026: మహా శివరాత్రి రోజున రాజయోగాలు.. ఆ మూడు రాశులకు అదృష్టం

05-02-2026 గురువారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments