Daily Horoscope
✕

షిర్డి సాయిబాబా సందేశం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (23:38 IST)
బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని బాబా చెప్పారు.

 
తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు.  మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడు.

 
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా.... బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబాది సచ్చిదానంద స్వరూపం. సాయినాధుడు నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. ఎల్లప్పుడు ఆత్మానందంలో తేలియాడుతుండేవారు.

 
మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి నేను, నాది అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నారు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవరాశుల్లో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పారు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)

నిన్నటి వరకు బిలియనీరు.... ఇపుడు పరువు కోల్పోయి దారుణ స్థితికి దిగజారిపోయారు...

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకి మంచు మనోజ్ ఒప్పందం

టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 14 నుంచి 30 వరకు కోటి దీపోత్సవం- కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన

13-11-2026 రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?

కలలో గుడ్లగూబను చూస్తే ఏంటి ఫలితం?

12-11-2026 గురువారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి..

శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?

తర్వాతి కథనం
Show comments