Daily Horoscope
✕

వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తే జీవనభారం తగ్గుతుంది...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (22:20 IST)
వ్యక్తి యెుక్క పూర్వ కర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్థించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది.
 
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. 
 
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే  భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
5. మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
6. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే వాని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
7. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యంతర ఫలితాలతో ఓ పెద్ద అడుగు వెనక్కిపడింది.. అయినా వెనక్కి తగ్గేది లేదు : డోనాల్డ్ ట్రంప్

మరో ఆరు నెలల్లో ఏపీలో ఎన్నికల్లో - అపుడు వైకాపా ఘన విజయం : చెవిరెడ్డి

ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ముగ్గురు ఇరానీయులకు ఉరిశిక్ష

అది రాజకీయ గ్రంథం కాదు... రచన వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు : సోనియా గాంధీ

జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత విజయం

అన్నీ చూడండి

లేటెస్ట్

09-11-2026 సోమవారం దిన ఫలాలు - పందాలు, పోటీల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

08-11-2026 దీపావళి నాటి రాశి ఫలితాలు- కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

తర్వాతి కథనం
Show comments