జీవితమంతా యాతనలు పడ్డాక ఆ రహస్యం తెలుస్తుంది

ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించే వారే యధార్థంగా జీవిస్తున్నవారు. తక్కినవారు జీవన్మృతులు. 2. లోకంలో సదా దాతవై వర్ధిల్లు. సహాయం-సేవ చేయి, నీవు ఇవ్వగలిగిన ఏ అల్ప వస్తువునైనా ఇవ్వు. వస్తు మార్పిడి పద్ధతికి దూరంగా ఉండు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (17:30 IST)
ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించే వారే యధార్థంగా జీవిస్తున్నవారు. తక్కినవారు జీవన్మృతులు.
 
2. లోకంలో సదా దాతవై వర్ధిల్లు. సహాయం-సేవ చేయి, నీవు ఇవ్వగలిగిన ఏ అల్ప వస్తువునైనా ఇవ్వు. వస్తు మార్పిడి పద్ధతికి దూరంగా ఉండు.
 
3. ఈ ప్రపంచం అనే నరకంలో ఏ ఒక్క హృదయంలో ఏ కాస్తయినా శాంతి సౌఖ్యాలు కలిగించగలిగితే అదే సత్కర్మ అనిపించుకుటుంది. జీవితమంతా యాతనలు పడ్డాక ఈ రహస్యం తెలుస్తుంది. తక్కినదంతా కేవలం బూటకం.
 
4. నాయనా.. మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్లు రప్పల్లాగా ఉండటం కంటే ధీరుల్లాగా మరణించటం శ్రేయస్కరం కాదా.. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది. తుప్పు పట్టేకంటే, ఈషణ్మాత్రమైనా పరులకు మేలు చేయటంలో అరిగిపోవటం మంచిది.
 
5. కోరికలన్నింటిని విడనాడి, సుఖభోగాలను త్యజించిన విశాల హృదయులైన స్త్రీపురుషులు వందలకొద్దీ ముందుకు వచ్చి పేదరికం, అజ్ఞానం అనే సుడిగుండంలో పడి నానాటికీ కృంగి, కృశించి, అణగారిపోతున్న లక్షలాది స్వదేశీయుల సంక్షేమ నిమిత్తం, అపరిమితమైన ఆ కాంక్షతో, తమ సర్వశక్తిని ధారపోసి, కష్టించి పని చేస్తేనే భారతజాతి జాగృతం కాగలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారుణ్య మరణం కేసు : తుదిశ్వాస విడిచిన హరీశ్ రాణా

Nara Bhuvaneswari: భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తారా? కుప్పం టూర్ అందుకేనా?

పార్లమెంట్‌లో వైకాపాకు తలనొప్పి.. 11 నెంబర్ గది వద్దు.. ట్రోల్స్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్: పాక్ చర్చలు

యువతితో అక్రమ సంబంధం... ఇంట్లో తెలిసిందనీ భార్యను చంపేసిన డాక్టర్ భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments