సీతాదేవితో హనుమంతుడు సంభాషించేటపుడు...

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:25 IST)
దైవ మార్గములో పయనించదలిచేవారు దేహాభిమానాన్ని, పేరు ప్రతిష్ఠలను దూరంగా ఉంచాలి. తనను లోక సేవకునిగాను, భగవంతుని దాసానుదాసుని గాను భావించాలి. మానవుడు నిరాడంబరుడై తనను భగవంతుని యొక్క ఒకానొక  సేవకునిగా తలంచుచు వినయ విధేయతలు కలిగి వర్తించాలి. చేతనైనంతవరకు లోకోపకారం చేస్తుండాలి. 
 
గౌరవ మర్యాదలను కాంక్షించరాదు. తాను గొప్పవాడైనా తన గొప్పను గూర్చి ఇతరులకు చెప్పుకొనగారాదు. అశోకవనమందు సీతాదేవితో సంభాషించేటప్పుడు హనుమంతుడు తాను శ్రీరామచంద్రుని వద్దగల వానరులలో చివరి వాడను అని చెప్పుకొన్నాడు. 
 
ఎంత బలము, సామర్థ్యము, శక్తి కల్గియున్ననూ హనుమంతుడు ఎంతటి వినయవిధేయతలు కలిగియున్నాడో లోకానికి తెలిసియేయున్నది కదా. కాబట్టి తరింపగోరేవారు నిరభిమానులై, భక్తి ప్రపత్తులు గలవారై ప్రతిష్ఠల కోసమై ప్రాకులాడక ప్రశాంత జీవితాన్ని గడపాలి. అట్టి  నిరభిమానుల వల్లనే లోకోద్ధరణ సంభవిస్తుంది. వారివల్లనే లోకం సుభిక్షంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు విధించిన టారిఫ్‌లు చెల్లవు: డొనాల్డ్ ట్రంప్‌కి అమెరికా సుప్రీంకోర్టు మొట్టికాయ, పీఎం మోడీ ఖుషీ

Summer holidays: తెలంగాణలో ఒంటి పూట బడులు.. షెడ్యూల్ ఇదే

వైఎస్సార్ కడప జిల్లాలో 15 అదనపు శనగ సేకరణ కేంద్రాల ఏర్పాట్లు

వైఎస్ జగన్‌ను కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం.. ఎక్కడ.. ఎందుకు?

సర్ ప్రక్రియలో సాయం కోసం జ్యూడిషియ అధికారుల నియామకం : సుప్రీంకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2026 ఆదివారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు

15-02-2026 నుంచి 21-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

తర్వాతి కథనం
Show comments