Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారికి క్రూర మృగాలు కూడా సలాం కొడతాయి: స్వామి వివేకానంద

కారణమే కార్య మవుతుంది. కారణంవేరు, దాని ఫలితంగా జరిగే కార్యంవేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇలా మన మనస్సుకు ప్రతిది వేరుగా కనిపిస్తుంటాయి. విశ్వం నిజంగా ఏకజాతీయమైనది. వైవిధ్య స్థూలదృష్టికి కనిపించేది మాత్రమే.

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (21:24 IST)
కారణమే కార్య మవుతుంది. కారణంవేరు, దాని ఫలితంగా జరిగే కార్యంవేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇలా మన మనస్సుకు ప్రతిది వేరుగా కనిపిస్తుంటాయి. విశ్వం నిజంగా ఏకజాతీయమైనది. వైవిధ్య స్థూలదృష్టికి కనిపించేది మాత్రమే. ప్రకృతిలో అంతటా, విభిన్న పదార్థాలు - విభిన్న శక్తులు మొదలైనవి ఉన్నట్లు కనిపిస్తాయి. రెండు వేరువేరు వస్తువులను తీసుకుందాము. గాజు ముక్కను, చెక్కమక్కను తీసుకోండి. రెంటిని పొడి చేయండి. ఇక పొడి చేయడానికి సాధ్యం కానంత పొడిచేయండి. అప్పుడు ఆ పదార్థం ఏకజాతీయంగా కనిపిస్తుంది. పదార్థాలన్నీ తమ అంతిమ దశలో ఏకజాతీయమైనవే.
 
ఏక జాతీయతే అసలు సత్యం,సారం. వివిద పదార్థాలుగా కనిపించే దృశ్యం వైవిధ్యం. ఏకం అనేకంగా కనిపించడం వైవిధ్యం. వినుట,కనుట రుచి చూచుట ఇవన్నీ ఒకే మనస్సు వివిధావస్థలు. గదిలోని వాతావరణాన్ని మనోశక్తివల్ల మార్పుచేసి, గదిలో ప్రవేశించే ప్రతివ్యక్తి వివిధ వైచిత్రాలను చూచేలా భ్రాంతి కలగవచ్చు. ప్రతి మనిషి ఇది వరకే భ్రాంతిని తగుల్కొని వున్నాడు. ఈ భ్రాంతిని తొలగించుటే సాధన స్వరూప సాక్షాత్కర ప్రాప్తి అవుతుంది.
 
మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కొత్తగా ఏ శక్తులను పొందపోవటంలేదు. ఇదివరకే శక్తులన్నీ ఉన్నాయి. భ్రాంతిని తొలిగించుకోవటంలోనే పొందవలసిన వికాసం క్రమమంతా ఉంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధి అతి ముఖ్యం. మానసిక శక్తులను పొందటమే ప్రధానంగా ఎంచవద్దు. వాటని త్యాగం చేయాలి. మానసిక శక్తులను కోరేవాడు, వాటికి వశమైపోతాడు. సిద్దులను కోరేవారంతా దాదాపుగా వాటిలోనే చిక్కుకొని భ్రష్టులవుతారు. మనుస్సును సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవటానికి నిర్దుష్ట నైతికనిష్ఠ అత్యవవసరం. ఇది కలవాడు చేయవలసిందిక ఏమీ ఉండదు. అతను ముక్తుడే. 
 
నైతిక పరిపూర్ణత్వన్నిపొందినవాడు, ఏ జీవికి హాని చేయలేడు, దేనిని బాధించలేడు. ముక్తుడు కావాలనుకునేవాడు అహింసలో ఉత్తీర్ణుడు అయితీరాలి. ఇలా అయినవానికన్నా శక్తిమంతుడు ఎవడూ లేడు. అతని సమక్షంలో ఎవరు పోరాడలేరు, కలహింపలేరు, అతని సాన్నిధ్యం శాంతిప్రదం, ప్రేమదాయకం, అతని సమక్షంలో ఎవ్వరూ ఆగ్రహింపలేరు. పశువులు, క్రూరమృగాలు కూడా అతని ఎదుట సాధువుగానే ఉంటాయి. ఇతరులు ఎంత దుష్టులైనాసరే, వారి దోషాల గూర్చి ఎప్పుడూ మాట్లాడవద్దు. అలా మాట్లాడితే ఏనాడు మేలు జరగదు. ఇతరుల తప్పులు ఎంచటం వల్ల నువ్వు చేయగల సహాయం ఏమిలేదు.
- స్వామి వివేకానంద

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

ఆకాశం చూడాలని విమానం ఎక్కారు.. అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నారు...

దాదర్ స్టేషనులో హైడ్రామా - క్షణాల్లో వ్యక్తిని కాపాడిన లేడీ కానిస్టేబుల్ (వీడియో)

బీహారీలకు ఏదైనా సాధ్యమే : పొలంలో మొసలి - భుజాన వేసుకెళ్లిన రైతు (వీడియో)

నీట్ యూజి 2026 అడ్మిషన్స్.. 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments