సుఖభోగాలు అనుభవింపనిదే ఆ బుద్ధి కలుగదు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (23:51 IST)
సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పక్షి గంగానదిలో లంగరు దించివున్న ఓడ స్తంభంపై పరధ్యానంగా వ్రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రంలోపలికి ప్రవేశించింది. అప్పుడు పక్షికి ఎరుక వచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడా తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది.
 
కాని అలా ఎంతదూరం పోయినా దానికి తీరం కనిపించలేదు. అందువల్ల అది తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పు దిశగా ఎగిరిపోయింది. ఆ దిశలో కూడా దానికి తీరం కానరాలేదు. ఆ పక్షి నలువైపులా చూసింది. కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకున్న పిదప అది మళ్లీ దక్షిణ దిశగా వెళ్లింది. అదేవిధంగా పడమటి వైపుగా కూడా వెళ్లింది.
 
తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగి వచ్చి ఆ ఓడ స్తంభం పైనే వ్రాలింది. మళ్లీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తరువాత దాని మనస్సులో ఎటువంటి అలజడి, అశాంతి చోటుచేసుకోలేదు. సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతుంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు.
 
కామినీ కాంచనాల పట్ల వారికి ఉన్న ఆశక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది. త్యాగభావన జనిస్తుంది. చాలామందికి సుఖభోగాలు అనుభవింపనిదే త్యాగబుద్ధి కలుగదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పని చేయని లిఫ్టు.. మేనేజర్‌ను హేళన చేస్తూ చెంప పగులగొట్టిన కరుణానిధి మనవరాలు (Video)

తిరుమల క్షేత్రంపై శబ్దం చేస్తే కేసు... అపరాధం

లైంగిక నేర బాధితురాలి గోప్యతను కాపాడేందుకు హైకోర్టు న్యాయవాది పోరాటం

ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ ఆఫీసర్... పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

ఉంగరం కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకున్న తల్లీకొడుకు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments