Daily Horoscope
✕

జీవితంలో మితిమీరిన కష్టాలొచ్చినప్పుడు శ్రీహరిని ఈ 16 నామాలతో పిలిస్తే?

సెల్వి
మంగళవారం, 22 సెప్టెంబరు 2026 (21:49 IST)
Lord Vishnu
జీవితంలో మనకు మితిమీరిన కష్టాలు, బాధలు, ఆకస్మిక ప్రమాదాలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనసు భగవంతుడిని వెతకడం మొదలుపెడుతుంది. అప్పటివరకు దేవుడిపై నమ్మకం గానీ, భక్తి గానీ లేనివారికి కూడా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఒకసారి దేవుడిని పూజించి చూద్దాం. దేవుడిని పూజిస్తే కష్టాలు తీరుతాయని నమ్ముతుంటారు. అయితే కష్టకాలంలో ఏ దేవుడిని పూజించాలో తెలియక సతమయ్యే వారు, కలియుగ వైకుంఠంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని పూజించడం వల్ల చాలా త్వరగా ఫలితం లభిస్తుంది.
 
శ్రీవారికి శ్రీ మహావిష్ణువు గజేంద్రునికి మోక్షం ప్రసాదించిన సంగతి తెలిసిందే. గజేంద్రుడు నమ్మకంతో ఆదిపురుషా అని పిలవగానే వైకుంఠం నుండి వెంటనే పరుగెత్తుకు వచ్చి ఆ ఏనుగును మొసలి బారి నుండి కాపాడటమే కాకుండా,  దానికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. దీనినే మనం గజేంద్ర మోక్షం అంటాం. అదే విధంగా ప్రహ్లాదుడు, శ్రీహరి స్తంభంలోనూ ఉన్నాడు. గడ్డిపరకలోనూ ఉన్నాడు అని చెప్పినందుకు అనుగుణంగా, అతడిని కాపాడటానికి స్తంభాన్ని చీల్చుకుని నరసింహుడిగా అవతరించాడు మహావిష్ణువు. ఇలా భక్తులు భక్తిశ్రద్ధలతో పిలిస్తే, శ్రీ మహావిష్ణువు పరుగెత్తుకు వచ్చి కాపాడతాడనడానికి పురాణాలలో ఎన్నో ఉదాహరణలు చెప్పబడి వున్నాయి. 
 
అలాంటి శ్రీ మహా విష్ణువుకు 16 దివ్యనామాలు ప్రసిద్ధి చెందినవి. 
శ్రీ మహా విష్ణువుకు ఎన్నో దివ్యనామాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన విశిష్టతను, శక్తిని కలిగి ఉంటాయి. శ్రీ మహా విష్ణువు వెయ్యి దివ్యనామాల సంకలనమే విష్ణు సహస్రనామంగా కీర్తించబడుతోంది. అలా వెయ్యి దివ్యనామాలను చెప్పలేని వారు అత్యంత ముఖ్యమైన 16 దివ్యనామాలను చెప్పి పూజించడం ద్వారా కూడా శ్రీ మహా విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ 16 దివ్యనామాలకు విష్ణు షోడశ నామం లేదా షోడశ నామ స్తోత్రం అని పేరు. ఈ 16 దివ్యనామాలను, వాటి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి చెప్పగలమా అని అడిగితే నేటి హడావుడి జీవితంలో చెప్పలేం. కానీ ఈ ప్రతి దివ్యనామాన్ని, మన దైనందిన జీవితంలో ప్రతి పనిని చేసేటప్పుడు చెప్పడం వల్ల పెరుమాళ్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు.
 
విష్ణు షోడశ నామ స్తోత్రం : 
మందు తీసుకునే ముందు - విష్ణు
భోజనం చేసేటప్పుడు - జనార్దనా
నిద్రపోయే ముందు - పద్మనాభా
వివాహం చేసుకునేటప్పుడు - ప్రజాపతి
యుద్ధ భూమిలో ఉన్నప్పుడు - చక్రధరా
ప్రయాణం చేసేటప్పుడు - త్రివిక్రమామరణ
శయ్యపై ఉన్నప్పుడు - నారాయణా
ప్రియమైన వారిని కలిసేటప్పుడు - శ్రీధరా
చెడు కలలు వెంటాడుతున్నప్పుడు - గోవిందా
ఆపద లేదా కష్టం వచ్చినప్పుడు - మధుసూదనా
అడవిలో ఉన్నప్పుడు - నరసింహా
నిప్పుల్లో చిక్కుకున్నప్పుడు - జలశయనా
నీటిలో చిక్కుకున్నప్పుడు - వరాహా
పర్వతాన్ని ఎక్కేటప్పుడు - రఘునందనా
బయటకు బయలుదేరేటప్పుడు - వామనా
ఏ పని చేసేటప్పుడైనా - మాధవా.... అని ఈ నామాలను పలికితే విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన ఫలితం దక్కుతుందంటారు ఆధ్యాత్మిక పండితులు. 

Related News

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేయసికి చెందిన ఇంట్లో ఉరేసుకున్న ప్రియుడు.. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు, ఖరీదైన కానుకలు..?

సునీలా... నాకు హైచ్ఐవి సోకింది, బతకాలని లేదు, ట్రాన్స్‌జెండర్ వీడియో కాల్

తల్లిదండ్రులపై ప్రేమంటే ఇలా వుండాలి.. వీడియో వైరల్

ఇండిగో విమానంలో నిప్పు రవ్వలు.. బీజేపీ ప్రముఖులు.. ప్రయాణీకులకు ఏమైంది?

ఏసీబీ వలలో చిక్కిన గుండు వాణి.. అవినీతితో రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2026- మంగళవారం రాశి ఫలాలు- అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

16-11-2026 సోమవారం దిన ఫలాలు - చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి...

15-11-2026 - ఆదివారం రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదు

శబరిమల: చాలకాయం-పంబ మార్గానికి రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు

తర్వాతి కథనం
Show comments