శనీశ్వరుడు పేరు చెప్పగానే ఎందుకంత భయం?

Webdunia
శనివారం, 23 మే 2020 (19:58 IST)
శని అనే పేరు చెప్పగానే చాలా భయపడిపోతారు. శని పట్టుకున్నదంటూ ఆందోళన చెందుతుంటారు మరికొందరు. అసలు శనీశ్వరుడు మహాశివభక్తుడు. పరమేశ్వరునిలా శనీశ్వరుడు కూడా భక్తుల కోర్కెలను తీర్చేవారేనని పండితులు అంటున్నారు. శని గ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడనీ, కనికరం లేనివాడని, మనుషుల్ని ప్టుకుని పీడించే వారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 
జనానాం కర్మఫలోం గ్రహరూప జనార్దనః - అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చే వారు జనార్థనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారు వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట.
 
ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిన నాటి శని ఆరంభమైనట్టే.
 
శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కాలక్షేపాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన శనీశ్వరుని అనుగ్రహమే అందరికీ రక్ష అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచుకుంటూ పోతే మిగిలేది శూన్యం : ఉచిత విద్యుత్ పథకం ప్రతిపాదనపై సుప్రీంకోర్టు

కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న... కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత - హరీశ్ రావుపై పోటీ...

కూతురుని కాపాడంటూ తిరుపతిలో మహిళ ఆక్రందన, AP Govt Fact Checkలో తేలిందేమిటంటే?

దళిత డ్రైవర్ హత్య - డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య హస్తం.. అజ్ఞాతంలోకి...

బాలికకు గంజాయి తాగించి మత్తులో వుండగా రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2026 నుంచి 21-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments