భగవంతుడికి ఇన్ని రూపాలు ఎందుకు ఉన్నాయి?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:51 IST)
శివుడనో, మాధవుడనో, కమలభవుడనో, పరబ్రహ్మనో ఎవరిని నిర్ణయించిరిరా, నినెట్లాఆరాధించిరిరా.... అని త్యాగరాజ స్వామి భగవంతుడిని కీర్తించారు. తనకు బాగా ఇష్టమైన తన తండ్రిగారు వారసత్వంగా అందించిన రామ నామాన్న, రామ భక్తిని, రామచంద్ర మూర్తి రూపాన్ని మదిలో నిలుపుకున్నారు. ఆ నామమే ఆయనకు భవ సాగరతరణానికి హేతువు అయ్యింది. ఆ రూపమే ఆయనకు విష్ణు సాయుజ్యాన్ని ప్రసాదించింది.
 
నిర్గుణ, నిర్వికార, నిర్విశేష, కేవల శుద్ద, బుద్ద పరమాత్మ స్వరూపాన్ని ఆయన రామభద్రుడిగా కొలుచుకున్నారు. మరొకరు ఈశ్వరుడిగా తలుస్తారు. ఇంకొకరు ఆదిపరాశక్తిగా భావన చేస్తారు. వేరొకరు తాము చేసే పనిలోనే దైవాన్ని చూడగలుగుతారు. దానినే తపస్సుగా భావన చేస్తారు. ఎవరు ఏ రూపంలో కొలచినా, తలచినా, పిలిచినా పరమాత్మ కరుణను ఆసాంతం సొంతం చేసుకోవడమే పరమావధి. ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఒక్కో రూపానికి ఒక్కో పరమార్థం ఉంటుంది. 
 
తెలిసి రామ భజన అని త్యాగయ్య చెప్పినట్లుగా ఏ రూపాన్ని కొలచినా, ఏ రూపంలో భగవంతుడిని పిలిచినా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ధర్మ మార్గంలో చరిస్తూ పరిపూర్ణంగా దైవానుగ్రహాన్ని సొంతం చేసుకోవడం ముఖ్యం. మీకు నచ్చిన రూపాన్ని ఆరాధించండి. మీకు బాగా నచ్చిన రూపాన్ని ప్రేమించండి. కానీ... ఆ ప్రేమ అనంతమైనదిగా ఉండాలి. ఆ ప్రేమ మీరు నమ్మిన ఆ భగవంతుడిని కూడా కదిలించగలగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైవేపై నిలిచి వున్న లారీ.. నిద్రిస్తున్న డ్రైవర్.. 350 లీటర్ల డీజిల్‌ గోవిందా

మెదక్ జిల్లాలో పాము కాటుకు బాలిక మృతి, తల్లి పరిస్థితి?

పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన వృద్ధుడికి షాక్.. బ్యాంకు ఖాతాలో రూ.759 కోట్లు

చోరీకి ప్రయత్నించిన దొంగతు ఊహించని రీతిలో గుణపాఠం చెప్పిన ప్రయాణికులు (వీడియో)

ఇంటికి వచ్చిన భర్త... ప్రియుడితో నగ్నంగా కనిపించిన 9 మంది పిల్లల భార్య... తర్వాత ఏం జరిగింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)

తర్వాతి కథనం
Show comments