మీకు తెలుసా!.. పాపాలు ఎన్ని రకాలు?

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:51 IST)
పాపాలలో మానసికం, వాచికం, కాయికం- అని మూడు రకాల పాపాలుంటాయని పెద్దలు చెప్పారు. మనసులో చెడ్డ ఆలోచనలు కలగటం, వేరే వాళ్ళకు చెడు కలగాలని కోరటం, ఇతరుల ప్రవర్తనను గురించి లేనిపోని ఊహలుచెయ్యటం, పరాయి ఆడవాళ్ళ గురించి చెడుగా ఆలోచించటం.. యివన్నీ మానసిక పాపాలు.
 
మనసులోకి వచ్చిన ఊహలన్నీ పైకి మట్లాడటం. పెద్దలను ఎదిరించి మాట్లాడటం. మహనీయులను వెక్కిరించటం. ఇతరులను గురించి చెడుగా ప్రచారం చెయ్యటం, నిందలు వెయ్యటం. ఎదుటి వాళ్ళను కఠినంగా తిట్టటం, బూతు మాటలు మాట్లాడటం. దారినపోయే ఆడ వాళ్ళను ఏదో అని వాగటం, అబద్ధాలాడటం, యివన్నీ వాచిక పాపాలు  అంటే మాటలతో చేసే పాపాలు.  
 
దొంగతనాలు చెయ్యటం, ఎదుటివారిని హింసించటం, జంతువులను పక్షులను కొట్టటం, పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం - యిలాంటివన్నీ కాయిక- అంటే శరీరంతో చేసే పాపాలు.
 
మనకు తెలియకుండాచేసే పాపాల్లో మానసిక పాపాలు, వాచిక పాపాలు ఎక్కువ, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఫలితం అనుభవింపక తప్పదు. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మానదు కదా !
 
కనుక మనము వీటి బారిన పడకుండా త్రికరణ శుద్ధిగా ఉండటం అలవాటుచేసుకోవాలి. సాధన తీవ్రంగా సాగితే తప్ప త్రికరణ శుద్ధిగా ఉండటం కుదరదు. 
 
మనసు నిండా గురువు/భగవంతుని ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా మానసిక పాపాలు చేయకుండా ఉండవచ్చు. సదా గురువు/భగవంతుని నామం స్మరణం చేయడం ద్వారా వాచిక పాపాలు చేయకుండా ఉండవచ్చు. 
 
శరీరంతో సదా గురువు/భగవంతుని సేవ చేయడం ద్వారా శారీరక పాపాలు చేయకుండా ఉండవచ్చు. వ్రంగా ప్రయత్నిద్దాం-మంచి ఫలితం ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?

శ్రీవారి భక్తులకు అలెర్ట్ : ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది : డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

నిరంజన్ ఫ్యామిలీకి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భరోసా (వీడియో)

రావణ్ వ్యాఖ్యలే జగన్‌కు ముఖ్యమా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

తర్వాతి కథనం
Show comments