Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో ఏకాంతంగా పుష్పయాగం

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (21:54 IST)
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం పుష్పయాగం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు.
 
ఆల‌యంలో మార్చి 2  నుండి 10వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు. ఆ త‌రువాత మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం జ‌రిగింది.

ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 పలురకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో  స్వామివారికి అభిషేకం చేశారు. ఇందుకోసం దాదాపు 3 ట‌న్నుల పుష్పాల‌ను వినియోగించారు. వీటిని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాత‌లు విరాళంగా అందించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మ‌ణ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

తర్వాతి కథనం
Show comments