Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్ళే భక్తులందరూ చదవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం...

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాల లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్ప

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (17:06 IST)
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాల లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 6, 20వ తేదీల్లో వయోవృద్ధులు(65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది.
 
ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. భక్తుల కోరిక మేరకు మరింతమందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
అలాగే 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను మార్చి 7, 21వ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. టిటిడి కల్పిస్తున్న టైం స్లాట్ విధానంపై భక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments