Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో టైమ్ స్లాట్ విధానం ప్రారంభం.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..? తిరుమ

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (12:17 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..? తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రకటించినట్టుగా సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానం గురువారం ప్రారంభమైంది. 
 
దీని ప్రకారం ఓ భక్తుడు క్యూ కాంప్లెక్స్ లోపలికి ఎన్ని గంటలకు రావాలన్న విషయాన్ని ముద్రిస్తారు. అధికారులు బయోమెట్రిక్ కూపన్ అందిస్తారు. ఈ కూపన్ తీసుకుని సమయానికి క్యూలైన్ వద్దకు వెళ్తే రెండు లేదా మూడు గంటల్లోనే స్వామిని దర్శించుకుని బయటకు వచ్చే వీలుంటుంది. అయితే ఈ కూపన్ పొందాలంటే.. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ తప్పనిసరి. 
 
సర్వదర్శనానికి టైమ్ స్లాట్ ప్రయోగాత్మకంగా టీటీడీ పరిశీలించింది. భక్తుల నుంచి టైమ్ స్లాట్ విధానానికి మంచి ఆదరణ లభించడంతో.. పకడ్బందీగా ఈ విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా అధునాతన కంప్యూటర్ల సాయంతో, 100కు పైగా టైమ్ స్లాట్ కేటాయింపు కేంద్రాలను తిరుమల, తిరుపతిలలోని పలు ప్రాంతాల్లో ఎంపిక చేశారు. 
 
ప్రస్తుతం నిర్దేశిత సమయంలో టైమ్ స్లాట్‌ను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించామని, మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తితిదే అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ పొందని భక్తుల కోసం సర్వదర్శనం క్యూలైన్ తెరిచే ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments