Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ లింక్‌తో శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్‌ : ఈవో అనిల్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇకపై టైమ్‌స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ నంబర్ అనుసంధానంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:35 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇకపై టైమ్‌స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ నంబర్ అనుసంధానంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి త్వరలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.
 
శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించారు. 23 మంది భక్తులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల రెండో వారం నుంచి సర్వదర్శనంలో టైమ్‌స్లాట్‌ విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. దాన్ని కొద్దిరోజులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. 
 
ఈ విధానం అమలులో ఎదురయ్యే లోటుపాట్లను సరిచేసి ఆధార్‌ అనుసంధానంతో పూర్తిస్థాయి టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఆధార్‌ లేనివారికి ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ద్వారానే దర్శనం కల్పిస్తామన్నారు. ఇకపోతే, ఈ నెల 29న ఏకాదశి, 30న ద్వాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments