కొత్త వివాదంలో తితిదే - లవుడు ఒక్కడే.. కుశడు కాదా? (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే సప్తగిరి మాసపత్రికలో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురితమైంది. సీతారాములకు ఒక్కరే కుమారుడని పేర్కొంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. 
 
ఈ వార్త చూడగానే బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆందోళనకు దిగారు. తితిదే వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తులు కూడా తితిదేపై మండిపడుతోంది.
 
ఇటీవలే తితిదే ఓ వివాదం నుంచి బయటపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తితిదే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం

Nara Lokesh: దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా విధానం.. నారా లోకేష్

పూర్తిగా తెరుచుకున్న హర్మూజ్ జలసంధి - భారత్‌‍ వైపు 26 నౌకలు

Leopard: పెంపుడు కుక్కను తరుముతూ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. గర్జిస్తున్న వీడియో వైరల్

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments