కిస్సింగ్ పవర్... ఎంతంటే?

ముద్దుపెడితే శరీరంలోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధకులు అధ్యయనంలో భాగంగా, ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను వెదికి పట్టుకున్నారు. వీరందర్నీ ఒక గదిలో ఉంచి, మంద్

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (20:43 IST)
ముద్దుపెడితే శరీరంలోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధకులు అధ్యయనంలో భాగంగా, ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను వెదికి పట్టుకున్నారు. వీరందర్నీ ఒక గదిలో ఉంచి, మంద్ర స్థాయిలో మంచి సంగీతం వినిపిస్తూ, వారి వారి భాగస్వాములను ముద్దు పెట్టుకోమని చెప్పారు. ఇంకేముంది అంతమంచి అవకాశాన్ని వదులుకోలేని ఆ ప్రేమ జంటలు ఓ పదిహేను నిమిషాలపాటు ముద్దుల్లో మునిగిపోయారు.
 
ఈ లోపు పరిశోధకులు తమకు రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నారు. ప్రేమజంటలు గాఢ చుంబనంలో ఉండగా వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ (ప్రేమబంధాలు గట్టిపడేందుకు ఈ రసాయనమే ముఖ్య కారణం), కార్టిసాల్ (ఆందోళనకు కారణమయ్యే రసాయనం) రసాయనాల మోతాదును పరిశోధకులు లెక్కగట్టారు. పరీక్షకు ముందు, తరువాతి మోతాదులను పోల్చి చూశారు.
 
చివరకు వీరి పరిశోధనల్లో తేలిందేమంటే... ముద్దు తరువాత యువతీయువకులిద్దర్లోనూ కార్టిసాల్ విడుదల బాగా తగ్గిపోయిందనీ, ఫలితంగా వారిలో మానసిక ఒత్తిడి దూరమైందని తెలుసుకున్నారు. అలాగే యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరగడాన్ని గమనించారు. అదే సమయంలో యువతుల్లో ఆక్సిటోసిన్ విడుదల తగ్గిపోయింది. 
 
ఇదలా ఉంచితే... అబ్బాయిల్లో సంతోషాన్ని పెంచే ఆక్సిటోసిన్, అమ్మాయిల్లో తగ్గిపోవడానికి మాత్రం పరిశోధకులకు కారణం అంతుబట్టడం లేదు. ఏదేమయినప్పటికీ... ప్రేమబంధం బలపడేందుకు ముద్దే ప్రధాన పాత్ర వహిస్తుందని మొత్తానికి వారు తేల్చేశారు.
 
ముద్దు ద్వారానే ప్రేమజంటల నడుమ అనుబంధం, శృంగారభరిత ప్రేమ, ఒకరినొకరు కావాలనుకునే కోరిక మరింతగా బలపడతాయని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments