తన బోయ్ ఫ్రెండ్ ఆమెను వదిలేశాడు... నాతో హేపీగా వుందట... పెళ్లాడవచ్చా?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (21:32 IST)
కాలేజీలో కలిసి చదువుకునేవాళ్లం. అప్పట్లో నాతో స్నేహంగా ఉండే అమ్మాయి మరొకరితో ప్రేమలో పడింది. 2 సంవత్సరాలు డేటింగ్ చేశారు వాళ్లిద్దరూ. బహుశా శృంగారంలో కూడా పాల్గొని ఉంటారేమో నాకు తెలియదు. కానీ అతడికి విదేశాల్లో జాబ్ వచ్చేసరికి వెళ్లిపోయాడు. అక్కడ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఈ విషయాన్ని నాతో చెప్పి చాలాసార్లు బాధపడింది. ఓరోజు అతడి నుంచి మెసేజ్ వచ్చిందట. తనను మర్చిపోవాలనీ, తను అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ వేరే సంబంధం పెద్దలు కుదిర్చారనీ చెప్పాడట. దాంతో ఆమె నావద్ద చాలా బాధపడింది. అతడిని బజారుకీడ్చటం ఇష్టం లేదని చెప్పింది. అతడిని ఎలా మర్చిపోవాలో తెలియడం లేదంటూ చెప్పేది.
 
ఇలా క్రమంగా నాతో ఎక్కువ సమయం గడుపుతూ వచ్చింది. ఓరోజు సాయంత్రం వేళ తన బాధలను చెపుతూ నా ఒడిలో తలపెట్టుకుని అలా కళ్లు మూసుకుంది. అలా కొద్దిసేపు గడిచాక అలా పడుకుంటే తనకు చాలా హేపీగా ఉన్నదనీ, నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తోందని చెప్పింది. నేనేమీ చెప్పలేదు. కానీ ఎందుకో ఆమె ఒక్కరోజు దూరంగా ఉన్నా నేను తట్టుకోలేకపోతున్నాను. నాక్కూడా ఆమెనే పెళ్లాడాలనుంది కానీ మాజీ బోయ్ ఫ్రెండుతో ఆమె శృంగారంలో పాల్గొని ఉంటుందేమోనని డౌటుగా ఉంది. ఆమెను అడిగేసి సందేహం తీర్చుకోవాలని ఉన్నా... ఆ సాహసం చేయలేకపోతున్నాను. ఏం చేయాలి...?
 
ఆమె ఎలాంటిదో ఒక స్నేహితుడిగా మీకు ఇప్పటికే తెలుసు. ఆమె పట్ల మీకున్న నమ్మకం, మీపట్ల ఆమెకున్న నమ్మకాన్ని బట్టి ఆలోచన చేయండి. ఇది జీవిత సమస్య. పెళ్లాడాలనుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కడదాకా జీవించాలి. కనుక ఓపెన్‌గా మాట్లాడాలి కనుక ఆమెను మానసికంగా సిద్ధం చేసి మీ అనుమానాలకు సమాధానాలను ఆమె వద్ద నుంచి రాబట్టండి. అయితే అది మీ బంధాన్ని దెబ్బతీసే రీతిలో ఉండకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరే చెబుతున్నారు... ఆమె దూరమైతే ఒక్కరోజు కూడా ఉండలేనని. కాబట్టి ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి రండి. చేదు జ్ఞాపకాలను వదిలేయడం తప్ప ఏమీ చేయలేం కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద పూడ్చిపెట్టింది.. కారణం ఏంటి?

చీరాలలో ఆరునెలల పసిబిడ్డ కిడ్నాప్.. లక్షకు విక్రయం.. 24 గంటల్లో కనిపెట్టేశారుగా..

అలీ ఖమేనీ అంత్యక్రియలు.. గుండెల్లో బాదుకున్న జనం.. ప్రతీకారం అంటూ నినాదాలు

భార్య ప్రవర్తనలో మార్పు.. అనుమానం.. చంపేసిన భర్త.. ఎక్కడ?

నూడుల్స్ వల్ల చాపకింద నీరులా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. 49మంది పరిస్థితి విషమం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్న సమంత

డా. శివరాజ్‌కుమార్‌, డాలీ ధనంజయ చిత్రం 666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌ టీజర్‌

Rav Ramesh: అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి విడుదల తేదీ ఖరారు

EVV: ఈవీవీ సినిమా ప్రొడక్షన్ లో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా చిత్రం

Jyothi Poorvaj : ఏంజెలీనా జోలిని తలపించేలా కిల్లర్... జ్యోతి పూర్వజ్ లుక్స్

తర్వాతి కథనం
Show comments