Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టిన రిలయన్స్ షేర్ : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:14 IST)
స్వదేశీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధ రికార్డు స్థాయిలో పలికింది. గురువారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు దూసుకునిపోయింది. తమ రీటైల్ వ్యాపారంలోకి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీంతో, ఆ సంస్థ షేర్ విలువ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఈ రిలయన్స్ షేరు విలువ ఒక్కసారిగా పెరగడంతో పాటు.. దాని ప్రభావం మిగతా వాటిపై కూడా పడింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ ముగిసే సమయానికి లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 646 పాయింట్లు పెరిగి 38,840కి చేరుకుంది. నిఫ్టీ 171 పాయింట్లు పుంజుకుని 11,449 వద్ద స్థిరపడింది. టెలికాం, మెటల్ మినహా ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
 
గురువారం ట్రేడింగ్‌లో అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.10 శాతం, ఏసియన్ పెయింట్స్ 4.25 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.70 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.79 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు ధర 2.51 శాతం చొప్పున పెరిగింది. అలాగే ప్రధానంగా నష్టపోయిన కంపెనీల షేర్ల ధరల్లో టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంకు, టైటాన్ కంపెనీ, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు షేర్లు బాగా ష్టపోయాయి. 
 
కాగా, బుధవారం నాటి ముగింపు ధర రూ.2,161తో పోలిస్తే గురువారం రిలయన్స్ షేర్ మరో రూ.151 పెరిగి రికార్డు స్థాయిలో రూ.2,313 వద్ద ట్రేడ్ అయింది. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ.14,67,670.76 కోట్లకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments