Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో భారత్ తొలి పతకం : రెండో అథ్లెట్‌గా రికార్డు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (09:53 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సొంతమైంది. అద్వితీయ పోరుతో శనివారం ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజతం రూపంలో దేశానికి తొలి పతకం అందించింది. 
 
మహిళల సింగిల్స్ క్లాస్ 4‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి ఝౌ యింగ్‌తో ఆదివారం ఉదయం జరిగిన పోరులో భవీనాబెన్ పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఫలితంగా, టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులెక్కింది.
 
మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. 
 
అయితే, చైనాకు చెందిన మియావో జాంగ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా నిన్ననే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావోతో జరిగిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో ఓటమి చెందింది. దీంతో సిల్వర్‌ మెడల్‌తో దేశానికి రానుంది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి. 
 
గుజరాత్‌కి చెందిన భవీనాబెన్‌ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. తొలుత ఫిట్‌‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించిన భవీనా.. ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకుని కష్టపడింది. 
 
మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్నది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments