Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఓపెన్ : మహామహులను మట్టికరిపించిన యువకెరటం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (08:24 IST)
న్యూయార్క్ వేదికగా జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల విభాగం ఫైనల్ పోరులో యువ కెరటం సరికొత్త చరిత్రను లిఖించింది. మహామహులను మట్టికరిపించిన బ్రిటిష్ యువకెరటం ఎమ్మా దరుకాను టైటిల్‌ను ఎగురేసుకునిపోయింది. 
 
మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 
 
150 ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది.  
 
ఈ తుదిపోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. 
 
ఇక ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. లో కూడా పరాజయం పొందలేదు. మొత్తం 20 సెట్లలోనూ నెగ్గడం విశేషం. ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా ఆమె ర్యాంకు 150 నుంచి 23కు వచ్చింది. ఇక బ్రిటన్‌లో తనే నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments