Webdunia - Bharat's app for daily news and videos

Install App

లియోనల్‌ మెస్సీ కొత్త డీల్.. బార్సిలోనాకు బైబై.. పారిస్‌తో కొత్త కాంట్రాక్ట్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:23 IST)
స్టార్ ఫుట్‌బాలర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్‌ మెస్సీ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం తెలిసింది. బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన మెస్సీ.. పారిస్​ సెయింట్​ జర్మన్​ క్లబ్ ​(పీఎస్​జీ)​తో మంగళవారం కొత్త కాంట్రాక్ట్​కు అంగీకారం తెలిపాడని సమాచారం. 
 
ఈ ఒప్పందం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించుకునే అవకాశం కూడా పీఎస్​జీ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాంట్రాక్ట్​పై మెస్సీకి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. అతడి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
 
లియోనల్ మెస్సీ మంగళవారం ఉదయం బార్సిలోనా విమానాశ్రయానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:30 ఫ్రెంచ్ రాజధాని పారిస్‌కు విమానంలో బయలుదేరాడు. ఈ సమయంలో మెస్సీతో పాటు అతడి భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 
 
అతని తండ్రి జార్జ్, మెస్సీ ప్రతినిధి కూడా పారిస్‌కు వెళ్లారు. పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్ ​(పీఎస్​జీ)​తో ఒప్పందం కుదుర్చుకోవడానికి మెస్సీ ఫ్రాన్స్ వెళ్లాడు. గత కొద్ది రోజులుగాపీఎస్​జీతో మెస్సీ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
 
లియోనెల్ మెస్సీ ఇటీవలే స్పానిష్ క్ల‌బ్ బార్సిలోనాతో త‌న‌కున్న రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సంగ‌తి తెలిసిందే. పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్ల‌బ్‌.. మెస్సీ లాంటి ఖ‌రీదైన ఆట‌గాన్ని కొన‌సాగించ‌డం అసాధ్యం. పైగా మెస్సీ త‌న ఫీజును మ‌రో 30 శాతం పెంచాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ పుకార్ల‌ను మెస్సీ ఖండించాడు.
 
'జీతం పెంచ‌డం కాదు.. 50 శాతం త‌గ్గించుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బార్సిలోనాలోనే కొన‌సాగ‌డానికి ప్ర‌య‌త్నించాను' అని మెస్సీ ఫేర్‌వెల్ సంద‌ర్భంగా చెప్పాడు. అయితే జీతం 50 శాతం త‌గ్గించుకోవ‌డం కాదు.. అస‌లు ఫ్రీగా ఆడ‌తాన‌న్నా అతడు బార్సిలోనాలో కొన‌సాగ‌డం కుద‌రదని రూల్స్ చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments