Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (14:43 IST)
భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా రెండో వివాహం చేసుకోనున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. సానియాతో విడాకుల తర్వాత పాక్ నటి సానా జావేద్‌ను షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో సానియా కూడా రెండో వివాహం చేసుకోబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. విడాకుల తర్వాత హైదరాబాద్ నగరంలో ఉంటున్న సానియా.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ, తన కుమారుడి బరువు బాధ్యతలను చూసుకుంటున్నారు.
 
ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి అనూహ్యమైన సలహా వచ్చింది. కొత్త జీవితం ప్రారంభించాలని అన్న సానియా పోస్టుకు ఓ భిమాని స్పందిస్తూ, సానియా కొత్త జీవితం ప్రారంభించాలని, కానీ, ముస్లిం అబ్బాయిని మాత్రం పెళ్లాడొద్దు అని సలహా ఇచ్చారు. అతడి సలహాకు నెట్టింట మిశ్రమ స్పందన వస్తుంది. 
 
సానియా మీర్జా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. వీటిని సానియా తండ్రి ఖండించారు. వాటిని నిరాధార వార్తలుగు కొట్టిపారేశారు. కాగా, షమీ కూడా భార్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

తర్వాతి కథనం
Show comments