Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడితో బూరెలా.. ఎలా చేయాలంటే..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (10:56 IST)
కావలసిన పదార్థాలు:
తీపి గుమ్మడి తురుము - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - 1 స్పూన్
జీడిపప్పు - 1 స్పూన్
నెయ్యి - పావుకప్పు
మినపప్పు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉప్పు - చిటికెడు
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా మినపప్పు, బియ్యాన్ని కలిపి నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి తురుమును శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి దానిపై బరువు పెట్టాలి. కాసేపటికి అందులో తడి పోతుంది. తరువాత స్టౌవ్ మీద బాణలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి గుమ్మడి తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో బెల్లం తురుము వేసి కలుపుకోవాలి. 
 
ఆ తరువాత ఆ మిశ్రమంలో యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ పరిమాణంలో ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న పిండిలో ఉప్పువేసి కలుపుకోవాలి. పూర్ణం ఉండల్ని ఒక్కోటి చొప్పున ఆ పిండిలో దిప్ చేసి నూనెలో వేసి వేయించి తీసుకుంటే.. టేస్టీ టేస్టీ గుమ్మడి బూరెలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలొద్దు.. అమ్మాయిలూ మోసపోతారు.. జర జాగ్రత్త : సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

కుక్కకాటు నుంచి తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్‌? (video)

Varanasi Story Updage: అంటార్కిటికాలో గడ్డకట్టిన మంచులో వారణాసి నుంచి మహేష్ బాబు

తర్వాతి కథనం
Show comments