రాగి కేక్ తయారీ విధానం..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (11:18 IST)
కావలసిన పదార్థాలు:
రాగి పిండి - ముప్పావు కప్పు
గోధుమ పిండి - ముప్పావు కప్పు
బేకిండ్ పౌడర్ - 1 స్పూన్
సోడా - అరస్పూన్
ఉప్పు - కొద్దిగా
కోకో పొడి - 5 స్పూన్స్
బెల్లం పొడి - 1 కప్పు
కొబ్బరి పాలు - ముప్పావు కప్పు 
వెనిలా ఎసెన్స్ - 1 స్పూన్
బటరం - 150 మి.లీ.
పెరుగు - పావుకప్పు
కొబ్బరి పాలు - 1 కప్పు
చక్కెర - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందు కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఈ ప్యాన్‌ను 170 డిగ్రీల పాటు పావుగంటపాటు ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో రాగి పిండి, గోధుమ పిండి, బేకిండ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి వేసి కలిపి రెండుసార్లు జల్లెడ పట్టాలి. ఆపై బెల్లం పొడి, ముప్పావు కప్పు కొబ్బరిపాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత బటర్, పెరుగు వేసి కలపాలి. 
 
ఇప్పుడు నెయ్యి రాసిన ప్యాన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి అవెన్ సుమారు అరగంటపాటు అలానే ఉంచాలి. ఆపై బయటకు తీసి పావుగంటపాటు చల్లారనివ్వాలి. ఒక పాత్రలో పాలు, చక్కెర, కోకో పొడి వేసి స్టౌ మీద పెట్టి చక్కెర కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తరువాత ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి కలిపి కాసేపు ఉంచి దింపి చల్లారబెట్టాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత క్రీమ్‌గా తయారవుతుంది. ఆపై దీనిని కేక్ మీద పోసి చాకుతో సరిచేయాలి. అంతే... టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం మత్తులో కత్తితో దాడి చేసిన భర్త.. భర్త, కుమారుడు మృతి

ఇరాన్ చిత్తుగా ఓడిపోయేంత వరకు యుద్ధం చేయండి : డోనాల్డ్ ట్రంప్

అసలే యుద్ధం ఓవైపు.. మరోవైపు కోవిడ్.. వియత్నాంలో 29 కరోనా కేసులు

టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్ దాఖలు.. ఆస్తుల సంగతేంటంటే?

డబ్బు.. డబ్బు.. డబ్బు.. వేధిస్తుందని ప్రియురాలిని చంపి.. ఫ్రిజ్‌లో పెట్టాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi again postponed: రామ్ చరణ్ పెద్ది జూన్ 25న విడుదల - మరి అఖిల్.. లెనిన్ పరిస్థితి ఏమిటో !

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం

Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments