పిల్లల కోసం స్వీట్ సమోసా... ఎలా చేయాలో తెలుసా?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (22:13 IST)
సాయంత్రమయ్యేసరికి పిల్లలు రకరకాల స్నాక్స్ కావాలని, బయట దొరికేవే కావాలని గొడవ చేస్తుంటారు. బయట లభించే పదార్దాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇంట్లోనే రకరకాల స్నాక్స్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అదే స్వీట్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ సమోసాను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థములు:
జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి)-  1 కప్పు
కొబ్బరి కాయ-  ఒకటి(తురుముకోవాలి),
పంచదార- మూడు  కప్పులు,
మిల్క్ మెయిడ్-  1 కప్పు,
యాలుకల పొడి-  టీ స్పూన్,
మైదా- పావు కిలో,
నెయ్యి-  కప్పు,
నూనె- పావుకిలో,
 
తయారుచేయు విధానం:
మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి. పాకంలో కొబ్బరితురుము వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకల పొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి. 
 
ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి. అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారుచేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తీసివేయాలి. ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసేయ్యాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ సమోసా రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments