Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో వేతనాల కోత

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (06:05 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా  వివిధ రకాల చెల్లింపులపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసకున్నారు.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు:
రాష్ట్రకార్పొరేషన్‌ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత
ఆలిండియా సివిల్‌ సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత
మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత 
నాలుగవ తరగతి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత 
అన్ని రకాల రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత 
నాలుగో తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత 
అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపు
ప్రభుత్వ గ్రాంటు పొంందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత.
 
పునరాలోచించాలి: ఐక్య వేదిక
కోత నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వరంగ, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన నిర్ణయం ఏ దేశంగానీ, ఏ రాష్ట్రం గానీ తీసుకోలేదని సంఘం నేతలు చావ రవి, సదానంద గౌడ అన్నారు.

నిజంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వం నుంచి వేల కోట్ల రాయితీలు పొందుతున్న వ్యాపార వర్గాల రాయితీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టడం, విరాళాల కోసం పిలుపునివ్వడం చేయొచ్చని, అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించి సమంజసమైన నిర్ణయం తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.
 
వేతనంపై ఆధారపడి బతికే ఉద్యోగుల జీతాల్లో ఏకంగా 50 శాతం కోత వేస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్తం అవుతుందని హెచ్చరించారు. 15 రోజుల లాక్‌డౌన్‌కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు. జీతాల తగ్గింపు తిరోగమన చర్య అని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
 
పోలీసు శాఖకు నిధులు
రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వినియోగించుకొనేందుకు వీలుగా రూ.53.53 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సోమవారం జీవో విడుదల చేసింది.

ఇందులో డీజీపీ కార్యాలయానికి రూ.50.81 కోట్లు, హైదరాబాద్‌ కమిషరేట్‌కు రూ.1.44 కోట్లు, సైబరాబాద్‌కు రూ.61 లక్షలు, రాచకొండ కమిషనరేట్‌కు రూ.67 లక్షలు మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments