హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎన్జీవో కాలనీలో జరిగిన ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి రోడ్డు నడుస్తూ వెళ్తుండగా.. ఇంతలో ఒక కారు వెనుక నుంచి వేగంగా వచ్చి, ఆమెను బలంగా ఢీకొట్టింది.
కారు స్పీడ్‌కు ఆమె గాలిలో బంతిలాగా ఎగిరి దూరంగా పడిపోయింది. దాదాపు.. ఆమె పది మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికలు యువతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. యువతికి బలమైన గాయాలు అయినట్లు కూడా తెలుస్తోంది.
కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కారు ప్రమాదానికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.