మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

ఐవీఆర్
గురువారం, 26 జూన్ 2025 (22:07 IST)
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన క్వాలిజీల్, నేడు హైదరాబాద్‌లో పేద పిల్లలకు విద్యను మరింతగా చేరువ చేసే క్రమంలో సీఎస్ఆర్ కార్యక్రమంను నిర్వహించింది. నిర్మాన్ ఆర్గనైజేషన్ సహకారంతో, కంపెనీ విద్యార్థులకు బ్యాక్-టు-క్లాస్‌రూమ్ కిట్‌లను మియాపూర్ లోని చావడి పేద విద్యార్థుల ఆశ్రమంలో పంపిణీ చేసింది. పిల్లలు పాఠశాలకు ఉత్సాహంగా వెళ్ళటానికి ప్రోత్సహించే రీతిలో నోట్‌బుక్‌లు, బ్యాగులు, స్టేషనరీ వంటి అవసరమైన పాఠశాల సామాగ్రిని కిట్లలో అందించింది. ఈ కార్యక్రమం క్వాలిజీల్ యొక్క మునుపటి సీఎస్ఆర్  ప్రయత్నాన్ని అనుసరించింది. గతంలో సంస్థ పేద యువతకు ల్యాప్‌టాప్‌లను సంస్థ పంపిణీ చేసింది.  
 
ఈ కార్యక్రమంలో క్వాలిజీల్ యొక్క వ్యూహాత్మక క్లయింట్ ఇన్స్పెరిటీ వద్ద ఇన్నోవేటివ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ బేకర్‌తో పాటు క్వాలిజీల్ సహ వ్యవస్థాపకురాలు, బిజినెస్ యూనిట్ హెడ్ కోటే బిపిల్లి, ఈ ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన చీఫ్ పీపుల్ ఆఫీసర్ హిమశ్రీ రఘుముద్రి పాల్గొన్నారు. వీరితో పాటుగా క్వాలిజీల్ నుండి సీనియర్ నాయకులు అనురూప్ గౌరవ్ (మార్కెటింగ్ హెడ్), సమ్మ్యౌ బండా (సీనియర్ డైరెక్టర్), విక్రమ్‌జిత్ సింగ్ (సీనియర్ డైరెక్టర్) కూడా హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమంలో కింబర్లీ బేకర్ మాట్లాడుతూ, “క్వాలిజీల్‌ను ప్రత్యేకంగా నిలిపేది వారి సాంకేతిక ఆవిష్కరణలు మాత్రమే కాదు, వ్యాపారం పట్ల వారి విలువల ఆధారిత విధానం. ఒక క్లయింట్‌గా, స్థానిక సమాజాలను ఉద్ధరించడానికి మా భాగస్వాములు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం చూడటం సంతోషంగా ఉంది..” అని అన్నారు. కోటే బిపిల్లి మాట్లాడుతూ విద్యా అవకాశాలను మెరుగుపరచటానికి తగిన మద్దతు ఇవ్వడానికి నిర్మాన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం, సాంకేతికత అనేది మానవాళికి సేవ చేయాలనే మా నమ్మకానికి ప్రతిబింబమన్నారు. క్వాలిజీల్‌ వద్ద నిజమైన వృద్ధి వ్యాపార మైలురాళ్లలో మాత్రమే కాకుండా, ఆ మార్గంలో తాము ప్రభావితం చేసే జీవితాలలో కూడా కొలవబడుతుందని విశ్వసిస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments