Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. కోలుకోవాలని ఆకాంక్ష

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (16:02 IST)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిని సందర్శించి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని రేవంత్ అన్నారు.
 
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఎడమ తుంటిని మార్చాలని వైద్యులు ప్రకటించారు. 
 
సీటీ స్కాన్‌ తర్వాత కేసీఆర్‌కు ఎడమ తుంటి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు శస్త్ర చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
 
జానా రెడ్డి పరామర్శ..
యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే జయ వీర్‌రెడ్డితో పాటు ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్‌ను పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments