Daily Horoscope
✕

తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు- సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సెల్వి
బుధవారం, 11 నవంబరు 2026 (20:18 IST)
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలవుతున్న ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసి, దానిని పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ విధానానికి బదులుగా, దేశవ్యాప్తంగా అనేక సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో అమలవుతున్న నమూనాలోనే తెలంగాణలో కూడా 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త విధానం వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి అమల్లోకి రానుంది. 
 
కొత్త విధానం ప్రకారం నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్యగా, 9వ తరగతి నుంచి +2 వరకు ఉన్నత విద్యా దశగా వర్గీకరించనున్నారు. ముఖ్యంగా +2 స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Revanth Reddy
 
ఈ మార్పుల వల్ల ఏ ఒక్క విద్యార్థికీ ఇబ్బంది కలగకుండా అమలు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే విధంగా కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Related News

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA23 Upadate : AA23 చిత్రంలో గ్యాంగ్‌స్టర్ గా అల్లు అర్జున్ చూపించనున్న లోకేష్ కనగరాజ్‌

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసేలా మాయలేడి ఉంటుంది - రాకేష్ వర్రే

Raj Tarun : రాజ్ తరుణ్... టార్టాయిస్ సినిమా నుంచి రంగు రంగు రంగు పిల్లరో లిరికల్ సాంగ్

పిల్లలందరూ చూసే సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు : తణికెళ్ల భరణి

Prabhas’s 24-year: రెబల్ స్టార్ ప్రభాస్ 24 ఏళ్ల నట ప్రస్థానం, సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్

తర్వాతి కథనం
Show comments