తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

ఠాగూర్
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (15:05 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్ర రావు జోస్యం చెప్పారు. అదేసమయంలో త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టేలా నేతలు, కార్యకర్తలు పని చేయాలని ఆయన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పిలుపునిచ్చారు.
 
'నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లోకి వెళ్లాలి. ఇంటింటికీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. స్థానిక ఎన్నికల్లో భాజపా మెజారిటీ స్థానాలు సాధిస్తుందనే నమ్మకముంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నాం. ఎవరు అడ్డుపడినా.. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాషాయ జెండా ఎగరవేయడం తథ్యం. పదవులు పొందడం కాదు.. వాటిని బాధ్యతగా నిర్వహించాలి. కార్యకర్తగా 40 ఏళ్లు భాజపాలో కొనసాగినందుకు సంతోషంగా ఉంది. భాజపా నిర్విరామ కృషి వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. 
 
భారత రాష్ట్ర సమితి పాలనలో 10 ఏళ్లు కేసీఆర్‌ మాటలతో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్‌లను అమలు చేసే పరిస్థితులు లేవు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. కేవలం 600 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలి. 
 
జీఎస్టీ తగ్గింపును దేశప్రజలు స్వాగతిస్తున్నారు. దీని వల్ల అన్ని సామాజికవర్గాలు లబ్ధి పొందుతాయి. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఖరీఫ్ సీజన్ పూర్తి అయ్యే లోపు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందుతుంది. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోంది. దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు.. డబుల్ ఇంజిన్‌ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నారు' అని రామచందర్‌ రావు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

Sapthami Gowda: సతీష్ నినాసం హీరోగా ది రైజ్ ఆఫ్ అశోక నుంచి పాట విడుదల

Renu Desai: రేణు దేశాయ్ నటిస్తున్న సినిమా 16 రోజుల పండగ

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments