ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (10:46 IST)
ఆగివున్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరంతా విందులో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. విందు ముగించుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో, వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై అప్పటికే నిలిపి ఉంచిన ఒక లారీని వీరు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
 
ప్రమాద తీవ్రతకు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్ను మూశారు. ప్రమాదంలో 20 మందికిపైగా గాయపడగా వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు విందు నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో చెన్వెళ్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

అప్పట్లో తెలియక బెట్టింగ్ యాప్‌ని గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేసా: ప్రకాష్ రాజ్ (video)

కాంత లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి : దుల్కర్ సల్మాన్, రానా

సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments