Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరీదైన బెంజ్ కారులో వచ్చి గన్‌తో కాల్చుకు చనిపోయాడు?

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (10:58 IST)
హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంజ్ కారులో ఉన్న సదరు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి వద్ద ఉన్న ఔటర్ రింగు రోడ్డు మీద ఈ ఘటన జరిగింది. TS 09 UB 6040 నెంబరు గల రెడ్ కలర్ బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి రోడ్డుమీద కారు ఆపి తుపాకీతో కాల్చుకున్నాడన్నది ప్రాధమిక సమాచారం. 
 
బాధితుడును ఫైజాన్ అహ్మద్‌గా గుర్తించారు పోలీసులు. ఇతను కొంతకాలంగా యూఎస్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఫైజాన్ అహ్మద్ లోయర్ ట్యాంక్ బండ్‌ సమీపంలో ఉన్న వాయు విహార్‌లో నివసిస్తున్నట్టు తెలిసింది. 
 
ఫోర్ వీల్స్ అనే కంపెనీని నుంచి బెంజ్ కారును అద్దెకు తీసుకుని కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదకు వెళ్లి నార్సింగి - మంచిరేవుల మధ్య కారును రోడ్డుపక్కన ఆపి గన్‌తో కాల్చుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments