Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాకు హోం మంత్రి అమిత్ షా

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (11:25 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు సంభంధించి షెడ్యూల్ ఖారరైంది. మంగళవారం మధ్యాహ్నం అదిలాబాద్‌‌లోని డైట్ కళాశాల మైదానంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్‌లోనూ అదే రోజు అమిత్ షా సభ నిర్వహించాలని బీజేపీ భావించింది. కానీ ఈ సభ రద్దయింది. దీనికి బదులు సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 7.30 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు.
 
అమిత్ షా షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే,
మంగళవారం మధ్యాహ్నం గం.1.45 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం గం.2.35కు ప్రత్యేక హెలికాప్టరులో అదిలాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం గం.3 కు గం.4 వరకు అదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. గం.4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.5.05కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.5.20 నుంచి సాయంత్రం గం.6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం. గం.6 కు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు. గం.6.20 నుంచి గం.7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో సమావేశం. రాత్రి గం.7.40 సమయానికి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ. రాత్రి గం.9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments