Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజుల్లో ఇట్లాంటి నాయకులు ఉన్నారా?

Webdunia
శనివారం, 10 జులై 2021 (06:46 IST)
ఆదర్శవంతమైన రాజకీయ జీవితం.. నిరాడంబరతకు నిలువుటద్దం.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. అయినా, నేటికీ సొంత ఇల్లు, వాహనం లేని వైనం.. మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి(88) ప్రస్థానమిది.

ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు సరిపోయేలా ఆస్తులు కూడబెట్టుకుంటున్న రోజులివి.. కానీ, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి.. అనంతరం రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన చరిత్ర ఆయన సొంతం.. పూర్వ నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లలో యాదగిరిరెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

తొలిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అనంతరం ఆయనకు వేతనంగా నెలకు రూ. 12 వేలు లభించేవి. 1994లో ఈ మొత్తం రూ. 15 వేలకు చేరింది. యాదగిరిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తన ముగ్గురు సంతానాన్ని సర్కారు బడిలోనే చదివించారు.

మరో కుమార్తెను మాత్రం ప్రభుత్వ వసతిగృహంలో చేర్చారు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తుండగా.. చిన్న కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలవడంతో.. పార్టీ సిద్ధాంతాలను అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా యాదగిరిరెడ్డి పనిచేశారు.

మూడోసారి ఎన్నికల్లో పోటీచేసేందుకు నాడు చేతిలో డబ్బుల్లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మివేశారు. నేడు హైదరాబాద్‌లోని చంపాపేటలో రూ.5 వేలు చెల్లించి అద్దె ఇంటిలో భార్యతో కలిసి ఉంటూ శేషజీవితాన్ని కొనసాగిస్తున్నారు. సర్కారు నుంచి అందే రూ. ముప్పై వేల ఫించన్‌ వారికి ఆసరాగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments